Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లో సైరన్లతో ఉద్రిక్త వాతావరణం
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. శనివారం ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై చేసిన దాడుల నేపథ్యంలో ఇరాన్‌తో పాటు, హమాస్, హెజ్‌బొల్లా వంటి గ్రూప్‌ల నుంచి రిప్లై దాడులు జరగవచ్చని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు అంచనా వేస్తున్నాయి. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు వద్ద రాకెట్ సైరన్లు మోగుతుండగా, లెబనాన్ నుంచి వచ్చిన నాలుగు డ్రోన్లను ఇజ్రాయెల్ వైమానిక దళం సమర్థంగా అడ్డుకుందని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్య కోసం తాము సిద్ధంగా ఉన్నామని, మమ్మల్ని రక్షించుకోవడం తమ హక్కు అని ఇరాన్ ఎంపీ అహ్మద్ అజ్జమ్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌కు చెందిన ఇద్దరు సైనికులు మరణించినట్లు తెలిసింది.
దాడుల్ని ఖండించిన సౌదీ అరేబియా, యూఏఈ, పాకిస్థాన్
ఈ దాడుల్లో ఇజ్రాయెల్ దాదాపు 100 యుద్ధ విమానాలను ఉపయోగించి, టెహ్రాన్‌లోని 20 లక్ష్యాలపై బాంబులు వదిలింది. ఇరాన్‌కు చెందిన డ్రోన్ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టులు ముఖ్య లక్ష్యాలుగా చొప్పించబడ్డాయి. దక్షిణ టెహ్రాన్‌లోని ఒక డ్రోన్ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే, తమ నష్టం పరిమితంగానే ఉందని ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), పాకిస్థాన్ వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి.