LOADING...
Italy : ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందాన్ని నిలిపివేసిన ఇటలీ  
ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందాన్ని నిలిపివేసిన ఇటలీ

Italy : ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందాన్ని నిలిపివేసిన ఇటలీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటలీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఒప్పందంలో సైనిక సామగ్రి మార్పిడి, సాంకేతిక పరిశోధనలు కూడా ఉన్నాయి. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని మంగళవారం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందాన్ని ఇకపై స్వయంగా కొనసాగించే ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2006లో ఆమోదం పొందిన ఈ ఒప్పందాన్ని ప్రతి ఐదేళ్లకోసారి సమీక్ష చేస్తుంటారు.

వివరాలు 

ఇజ్రాయెల్ రాయబారిని పిలిపించిన ఇటలీ

ఇటలీ-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లెబనాన్‌లో ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల్లో ఉన్న ఇటలీ సిబ్బంది కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ దళాలు హెచ్చరిక కాల్పులు జరిపాయని ఇటలీ ఆరోపించింది. దీనికి నిరసనగా ఇజ్రాయెల్ రాయబారిని ఇటలీ పిలిపించింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోయినా, ఒక వాహనం మాత్రం దెబ్బతిన్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండించారు. లెబనాన్ రాజధాని బెరూట్‌లో అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, విదేశాంగ మంత్రి యూసుఫ్ రాగ్గితో సమావేశమైన ఆయన, పౌరులపై జరుగుతున్న దాడులు అంగీకరించలేనివని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇటలీ మద్దతు తెలియజేయడానికి తాను అక్కడికి వెళ్లినట్టు తెలిపారు.

వివరాలు 

ఇజ్రాయెల్ చర్యలపై కఠినంగా స్పందించిన ఇటలీ

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 2వేల మందికిపైగా మృతి చెందగా, 6వేల మందికి పైగా గాయపడినట్టు సమాచారం. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి Israel Katz,లిటానీ నది వరకు లెబనాన్ భూభాగాన్ని నిరవధికంగా ఆక్రమిస్తామని ఇటీవల ప్రకటించారు. ఇది ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఉండి,లెబనాన్ భూభాగంలో దాదాపు 10 శాతం ఉంటుంది. దక్షిణ లెబనాన్‌లో గ్రామాలను పేల్చివేయడం, ఇళ్లను ధ్వంసం చేయడం కొనసాగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ చర్యలపై ఇటలీ ఇంతకుముందు కూడా కఠినంగా స్పందించింది. 2024లో గాజా ప్రాంతంపై దాడుల తర్వాత ఆయుధాల అమ్మకాలను కూడా నిలిపివేసింది. యుద్ధంలో పాల్గొంటున్న దేశాలకు, మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నట్టు అనుమానం ఉన్న దేశాలకు ఆయుధాల ఎగుమతులను ఇటలీ చట్టాలు నిషేధిస్తున్నాయి.

Advertisement