Joe Biden Gun Law: అమెరికాలోని గన్ సంస్కృతి..కొత్త చట్టం తీసుకొచ్చిన బైడెన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో తుపాకీ సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. ప్రతి రోజూ ఎక్కడోచోట కాల్పులు జరుగుతూ, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం లేదా గాయపడడం సాధారణమైన అంశంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులు కూడా ఈ హింసకు బానిసలవుతున్నారు.
ఈ తుపాకీ హింసకు ముగింపు పలకాలని ఆశయంతో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త చట్టంపై సంతకం చేశారు.
అలాగే, ఎన్నికల కారణంగా ఆర్థిక వ్యవహారాలకు అంతరాయం కలగకుండా, స్టాప్‌గ్యాప్ బిల్లుపై కూడా ఆయన సంతకం చేశారు.
ఈ బిల్లుతో డిసెంబరు 20 వరకు ప్రభుత్వం నిధులను అందుకోవచ్చని ది గార్డియన్ తెలిపింది.
అధ్యక్ష పదవి నుంచి వెళ్లడానికి మరో రెండు నెలల ముందు ఈ చర్యలు తీసుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.
వివరాలు
అమెరికాలో తుపాకీ హింస
'అమెరికాలో వ్యాధులు లేదా ప్రమాదాల వల్ల కన్నా తుపాకీ కారణంగా చిన్నారులు మరణించే సంఖ్య అధికంగా ఉంది. ఇది చాలా బాధాకరం. ఈ హింసను అంతం చేయడానికి నేను, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కలిసి పనిచేస్తున్నాం. మీరు కూడా మాతో చేతులు కలపండి' అని బైడెన్ తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
అంతేకాక,తుపాకీ హింసను అరికట్టడానికి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకాలు చేసినట్లు వెల్లడించారు.
అమెరికాలో తుపాకీ హింస తీవ్రమైన స్థాయికి చేరుకుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో కాల్పుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
2020లో 4,368 మంది చిన్నారులు తుపాకీ కారణంగా మృతి చెందారని, 2019లో ఈ సంఖ్య 3,390గా ఉండగా, 2021లో 4,752కి పెరిగిందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
వివరాలు
జార్జియాలోని పాఠశాల కాల్పుల్లో నలుగురు మృతి
ఈ డేటా ప్రకారం, 2020 నుంచి పిల్లల మరణాలకు తుపాకీ హింస ప్రధాన కారణంగా ఉంది.
ఇటీవలి కాలంలో జార్జియాలోని పాఠశాలలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
అలాగే, 2007లో వర్జీనియా టెక్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు, ఇది అమెరికా చరిత్రలో ఘోరమైన ఘటనగా నిలిచింది.
గత రెండు దశాబ్దాల్లో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో వందలాది కాల్పుల సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలు అమెరికా తుపాకీ చట్టాలు, రాజ్యాంగంలో రెండవ సవరణపై తీవ్ర చర్చలకు కారణమయ్యాయి, ఈ సవరణ ప్రకారం పౌరులకు ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉంది.