Page Loader
నోబెల్ సాహిత్య బహుమతిని దక్కించుకున్న నార్వే రచయిత జాన్ ఫోజే 
సాహిత్య విభాగంలో నోబెల్ అందుకున్న జాన్ ఫోజే

నోబెల్ సాహిత్య బహుమతిని దక్కించుకున్న నార్వే రచయిత జాన్ ఫోజే 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 05, 2023
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

నోబెల్ బహుమతుల ప్రకటనలు సోమవారం నుండి జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. 2023 సంవత్సరానికి గాను నార్వేకు చెందిన జాన్ ఫోజేను నోబెల్ సాహిత్య బహుమతి వరించింది. ఆయన రచించిన నాటకాలకు ఈ అవార్డు దక్కింది. జాన్ ఫోజే అనేక రచనలు, నాటకాలు, నవలలు, కవితా సంకలనాలు రచించారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నాటకాలు ప్రదర్శించిన వారిలో జాన్ ఫోజే కూడా ఒకరని స్వీడిష్ అకాడమీ తెలియజేసింది. నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 6వ తేదీన ప్రకటించనున్నారు. అలాగే అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 9న ప్రకటిస్తారు. అదలా ఉంచితే, డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సాహిత్యంలో నోబెల్ అందుకున్న జాన్ ఫోజే