Air Force One: అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ లో వరుస దొంగతనాలు..దొంగలెవరంటే?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉపయోగించే 'ఎయిర్‌ఫోర్స్ వన్ ' విమానంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది.. ఎయిర్ ఫోర్స్ వన్ నుండి దొంగతనం చేస్తున్న సదరు వ్యక్తులను హెచ్చరించారు. వైట్ హౌస్ ప్రెస్ కార్ప్స్ విస్తృతమైన దొంగతనంపై వివరణాత్మక దర్యాప్తు శుక్రవారం యుఎస్ రాజధానిలో ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయాన్ని ఆంగ్లపత్రిక 'పొలిటికో' వెలుగులోకి తెచ్చింది. అధ్యక్షుడి పర్యటనలో ఆయనతో వెళ్లే మీడియా కరస్పాండెంట్లే దొంగలు. అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటనల్లో భాగంగా కొందరు మీడియా కరస్పాండెంట్లను తనతోపాటు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తీసుకెళతారు.
బోయింగ్‌లో 13 మంది జర్నలిస్టులు
ఆ సమయంలో సదరు సిబ్బంది శ్వేతసౌధం చిహ్నం ఉన్న వస్తువులను దొంగలించి ఆ తర్వాత విమానం దిగేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని ది వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేల్లీ ఓడేనియల్ (ఎన్‌బీసీ) ఇక ముందు అలాంటి చర్యలు మానుకోవాలని తోటి సభ్యులకు ఇమెయిల్ ద్వారా గట్టి హెచ్చరిక జారీ చేశారు. US ప్రెసిడెంట్ అధికారిక అవసరాల కోసం బయటికి వెళ్ళినప్పుడల్లా అతని బోయింగ్‌లో 13 మంది జర్నలిస్టులతో కలిసి ఉంటారు. వీరికి విమానంలో అందించే భోజనం, పానీయాలతో పాటు వారి ప్రయాణ ఖర్చులను మీడియా సంస్థలు చూసుకుంటాయి.