Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఝలక్ , కంచుకోటలో విపక్ష కన్జర్వేటివ్ విజయం
కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వచ్చే ఏడాది కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆ పార్టీ కంచుకోటకు బీటలు పడ్డాయి. గత మూడు దశాబ్దాలుగా లిబరల్ పార్టీకి కంచుకోటగా ఉన్న 'టొరంటో-సెయింట్ పాల్స్' పార్లమెంట్ స్థానంలో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా, ఉదారవాదులు ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్‌లో 338 సీట్లలో 155 కలిగి ఉన్నారు. ట్రూడో అతని ప్రభుత్వానికి గణనీయమైన షాక్ తగిలినట్లయింది. ఈ ఫలితం వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు వచ్చింది.
లిబరల్ పార్టీ ఓడినప్పటికీ ఓటర్ల విశ్వానికి మరింత కృషి.. ట్రూడో
లిబరల్ పార్టీ ఓడిపోయినప్పటికీ, వచ్చే ఏడాది ఎన్నికలలో లిబరల్ పార్టీని నడిపిస్తానని ఓటర్ల సమస్యలను పరిష్కరించడానికి "కష్టపడి పని చేస్తానని" ట్రూడో ప్రతిజ్ఞ చేశాడు. "ఇది స్పష్టంగా మేము కోరుకున్న ఫలితం కాదు, కానీ తాను మీ ఆందోళనలు చిరాకులను విన్నానని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ... ఇవి సులభమైన సమయాలు కాదు. కెనడియన్లు చూడగలిగే అనుభూతి చెందగల స్పష్టమైన, నిజమైన పురోగతిని అందించడానికి తాను , మా మొత్తం బృందం చాలా కష్టపడి పని చేయాల్సి ఉంది, "అని బ్లూమ్‌బెర్గ్ ఉటంకిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.
మధ్యంతర ఎన్నికలు నిర్వహించండి.. విపక్ష నేత
వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధికార పార్టీ.. ఓడిపోవడం ఆ పార్టీకి షాక్ ట్రీట్ మెంట్ వంటిదేనని కెనడా మీడియా సంస్థలు వ్యాఖ్యనిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి ఓడిపోవడంతో తక్షణమే పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అధినేత పియర్ పొయిలీవ్ర డిమాండ్ చేశారు.