Page Loader
Kamala Harris: 2024 ప్రెసిడెన్షియల్ రేస్‌లోకి కమలా హారిస్..ప్రచారానికి విరాళాల వెల్లువ..$1 బిలియన్లను వసూలు 
2024 ప్రెసిడెన్షియల్ రేస్‌లోకి కమలా హారిస్..ప్రచారానికి విరాళాల వెల్లువ..$1 బిలియన్లను వసూలు

Kamala Harris: 2024 ప్రెసిడెన్షియల్ రేస్‌లోకి కమలా హారిస్..ప్రచారానికి విరాళాల వెల్లువ..$1 బిలియన్లను వసూలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2024
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఈ క్రమంలో హారిస్‌కు భారీ స్థాయిలో మద్దతు వస్తున్నట్లు సమాచారం. ఆమె అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటినుంచి ఆమె ప్రచారానికి 1 బిలియన్ డాలర్ల విరాళాలు అందాయి. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ బరిలో నిలిచినప్పటినుంచి ఆమె పూర్తిస్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆమె అభ్యర్థిగా పేర్కొన్న రోజున 25 మిలియన్ డాలర్లు అందుకున్నారు. దాదాపు ఒక నెలలోనే 500 మిలియన్ డాలర్లు సేకరించారు. ఇక,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గత ఆగస్టులో 130 మిలియన్ డాలర్లు వచ్చినప్పటికీ, ఆ నెల చివరన 294 మిలియన్ డాలర్లు సేకరించగలిగారు.

వివరాలు 

అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ముమ్మరంగా ప్రచారం

అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ వైదొలిగి ఆయన స్థానంలో కమలాహారిస్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆమె అభ్యర్థిగా అవుతారని అన్నప్పటి నుంచీ డెమోక్రటిక్ పార్టీ పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నాయి. వచ్చే నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ పార్టీలూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.