Kenya Military Chief: కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఆర్మీ చీఫ్ సహా 9 మంది మృతి
కెన్యా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలాతో పాటు మరో తొమ్మిది మంది ఆర్మీ సభ్యులు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన వెంటనే హెలికాప్టర్ కూలిపోయిందని చెబుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం,కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మిలటరీ చీఫ్ మరణంపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో విచారం వ్యక్తం చేశారు. కెన్యా ఓ ధైర్యవంతుడైన సైనిక జనరల్‌ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలతో బయటపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
జనరల్ ఒగోలా వైమానిక దళానికి రెండవ లెఫ్టినెంట్
జనరల్ ఒగోలా తన సేవలో మరణించిన మొదటి కెన్యా మిలిటరీ చీఫ్,అని CNN నివేదించింది. స్టేట్ బ్రాడ్‌కాస్టర్ కెన్యా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (KBC)ని ఉటంకిస్తూ.. కెన్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, జనరల్ ఒగోలా 1984లో కెన్యా డిఫెన్స్ ఫోర్స్‌లో చేరారు. 1985లో కెన్యా వైమానిక దళానికి రెండవ లెఫ్టినెంట్ అయ్యారు.