
Pakistan: : పాకిస్తాన్ లాహోర్‌లో పేలుడు.. పరుగు తీసిన ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పేలుడు కలకలం రేపింది.
ఈ ఘటన లాహోర్ నగరంలోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలో గల గోపాల్‌నగర్,నసీరాబాద్ ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్ల రూపంలో చోటుచేసుకుంది.
గురువారం ఉదయం ఒక్కసారిగా విమానాశ్రయం వద్ద అలారంలు మోగిపోవడంతో స్థానికులు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ పేలుళ్లకు కారణం డ్రోన్ కావచ్చని పాక్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 5 నుంచి 6 అడుగుల పొడవు కలిగిన డ్రోన్ పేలిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
డ్రోన్ వ్యవస్థను జామ్ చేసి దాన్ని కూల్చివేసినట్లు తెలుస్తోంది.
ఈ వరుస పేలుళ్ల నేపథ్యంలో కరాచీ, ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్‌లోని పలు విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాంబు పేలుళ్లు
ఇక ,భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాతి రోజే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనించాల్సిన అంశం.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఈ బాంబు పేలుళ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాంబు పేలుళ్లు
Panic in Lahore after blast near laWhore airport pic.twitter.com/zsQNyoE4hx
— Team Jhaat Official (@TeamJhaant__) May 8, 2025