లిబియాలో కొట్టుకుపోయిన డ్యామ్..12 వేల మంది మృతితో శవాల దిబ్బగా మారిన డెర్నా
లిబియా దేశాన్ని కనీవినీ ఎరుగని రీతిలో వరద కప్పేసింది. ఈ మేరకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డెర్నా నగరంలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దాదాపు 11,300 మంది మరణించారు. మరో 10 వేల మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం రెడ్ క్రెసెంట్ గణాంకాలు వెల్లడించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. డెర్నా వెలుపల ఈస్ట్ లిబియాలో వరదల కారణంగా అదనంగా మరో 170 మంది చనిపోయారు. డేనియల్ తుఫాను ఈశాన్య లిబియాను తాకిన వారం తర్వాత డెర్నాను వరదలు కప్పేశాయి. మంచినీటి ఎద్దడితో కలుషిత నీరు తాగి 55 మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారు. డెర్నాలో డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోంది.