గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన బైడెన్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుసున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాధినేతల మధ్య కీలక చర్చలు జరిగాయి. అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికాకు మద్దతుగా నిలిచేందుకే తాను ఇజ్రాయెల్ వచ్చినట్లు బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఉందన్నారు.
మద్దతుగా నిలిచినందుకు అమెరికాకు ధన్యవాదాలు: నెతన్యాహు
గాజా ఆస్పత్రిపై జరిగిన దాడిపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిపై తాము దాడి చేయలేదని బైడెన్‌కు వివరణ ఇచ్చారు. గాజా ఆస్పత్రిపై దాడి చేసింది ఇజ్రాయెల్ సైన్యం కాదని, ఇతరుల బృందం పని అని తాము నమ్ముతున్నట్లు బైడెన్ చెప్పారు. హమాస్‌తో యుద్ధంలో అమెరికా తమకు మద్దతుగా నిలిచినందుకు బైడెన్‌కు బెంజమిన్ నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. గాజాలోని ఆసుపత్రిపై మంగళవారం దాడి జరగ్గా 500 మంది మరణించారు. ఈ దాడిని బైడెన్ ఖండించారు. ఈ దాడి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇదే సమయంలో బుధవారం బైడెన్‌తో జరగాల్సిన అరబ్ దేశాల నేతలతో సమావేశం రద్దు అయ్యింది.