తదుపరి వార్తా కథనం
Earthquake: చిలీలో భారీ భూకంపం .. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపణలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 03, 2025
09:45 am
ఈ వార్తాకథనం ఏంటి
చిలీలో భారీ భూకంపం సంభవించింది. ఇది కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటోఫగాస్టాలో జరిగిందని తెలిసింది.
భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్టు యూరోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
ఈ భూకంపం 104 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఏర్పడిందని వారు వివరించారు.
భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి మరిన్ని వివరాలు ఇంకా అందించలేదు.
అయితే, భూకంపం సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో దృశ్యాలను పంచుకున్నారు. వీడియోల్లో భూకంపం ప్రభావంతో భవనాలు కొద్దిసేపు ఊగుతుండటం కనిపించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఊగిపోయిన భవనాలు.. వీడియో
Another video of the M6.1 earthquake that hit Chile earlier....pic.twitter.com/w4FyDegf4n
— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025