Maldives: భారత జాతీయ పతాకాన్ని తప్పుగా పోస్ట్ చేసిన మాల్దీవుల మంత్రి సస్పెండ్
సోషల్ మీడియాలో భారత జాతీయపతాకాన్ని తప్పుగా పోస్టు చేసి అగౌరవ పరిచినందుకు గాను మాల్దీవుల దేశ మంత్రి మరియమ్ షీఉనా భారత్ కు క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆ పోస్టును సోషల్ మీడియానుంచి తొలగించారు. ప్రతిపక్షాలనుద్దేశించి రూపొందించిన పోస్టర్ లో పార్టీలోగోకు బదులుగా అశోక చక్రను ఉంచారు. త్వరలోనే మాల్దీవుల్లో ఆ దేశానికి పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మాల్దీవు అధ్యక్షుడు మహమ్మద్ మఇజ్జు అధికార పార్టీకి చెందిన మరియమ్ షిఉనా తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతూ తయారు చేసిన పోస్టర్ లో మన జాతీయ పతాకాన్ని అగౌరవపరిచారు. ఈ విషయాన్ని అక్కడి ప్రతిపక్షపార్టీలు వ్యతిరేకించగా మరియమ్ షీఉనా పై మఇజ్జు చర్యలు తీసుకోక తప్పలేదు. దీంతో ఆమె సస్పెండ్ అయ్యారు.
భారత్‌తో సంబంధాలు ఎంతో విలువైనవి: షిఉనా
భారత్‌తో మాల్దీవులకున్నసంబంధాలు ఎంతో విలువైనవని భారత్‌ను ఎప్పుడూ గౌరవిస్తామనని షిఉనా తెలిపారు. 2024 జనవరిలో భారత ప్రధాని మోడీ లక్షద్వీప్‌ను సందర్శించిన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటన సందర్భంగా లక్షద్వీప్ అందాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో షిఉనాతో సహా మాల్దీవుల అధికారులు భారత్ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.