LOADING...
Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక
కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక

Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 10, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో అధికార లిబరల్ పార్టీ ఆయనను తన నేతగా ఎన్నుకుంది. విశేషంగా, మార్క్ కార్నీ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. అంతేకాకుండా, ఆయనకు మంత్రివర్గ అనుభవం కూడా లేదు. అనూహ్యంగా, మార్క్ కార్నీ కెనడా 24వ ప్రధానిగా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరిలో, ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో, లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవడం తప్పనిసరిగా మారింది.

వివరాలు 

తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు ముగింపు

59 ఏళ్ల మార్క్ కార్నీ, రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి లిబరల్ పార్టీ కొత్త నాయకుడిగా ఎన్నికయ్యారు. దీని ద్వారా తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు ముగింపు పలికినట్లైంది. 1965లో ఫోర్ట్ స్మిత్‌లో జన్మించిన మార్క్ కార్నీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్‌గా పనిచేశారు. 2008 నుండి 2013 వరకు బ్యాంక్ ఆఫ్ కెనడా 8వ గవర్నర్‌గా వ్యవహరించారు. అనంతరం, 2013 నుండి 2020 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 120వ గవర్నర్‌గా సేవలందించారు. ఆర్థిక రంగంలో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లిబరల్ పార్టీ చేసిన ట్వీట్ 

Advertisement