LOADING...
Russia earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Russia earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆదివారం ఉదయం 5.25 గంటలకు కంటచ్కా ద్వీపకల్పంలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. ఈ భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరీకలు జారీ చేసింది.

Details

కోస్తా ప్రాంతంలో అలలు ఎగిసిపడే అవకాశం

పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీ నగరంలో 1,80,000 మంది నివాసముంటున్నారు. చుట్టూ అగ్నిపర్వతాలు ఉండగా, ఆ ప్రాంతంలో అత్యధిక భాగం నావల్ బేస్ అధీనంలో ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికి తర్వాత సునామా హెచ్చరికలు ఉపసంహరించుకుంది. ఇక సముద్ర మట్టంలో కదలికలల కారణంగా కోస్తా ప్రాంతంలోని కొన్నిచోట్ల అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement