China : చైనా రద్దీ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. ఎందుకు జరిగిందో తెలుసా?
చైనాలోని అత్యంత బిజీ పోర్టులో నింగ్బో-జౌషాన్ పోర్టు ఒకటి. ఈ ప్రాంతం ఎప్పుడూ నైకలతో రద్దీగానే ఉంటుంది. శుక్రవారం ఆగివున్న నౌక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో చుట్టపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనగకు గురయ్యారు. ఈ పేలుడు తీవ్రతకు దాదాపు 2 కిలోమీటర్ల మేరకు షాక్ వేవ్ ప్రయాణించిందని ది మిర్రర్ పత్రిక పేర్కొంది. ఇప్పటివరకూ ప్రాణనష్టం గురించి ఎలాంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
సురక్షితంగా బయటపడిన ఉద్యోగులు
తైవాన్‌కు చెందిన యంగ్ మింగ్ మెరైన్ ట్రాన్సుపోర్టు కార్పొరేషన్‌కు చెందిన వైఎం మొబిలిటీ అనే కార్గోషిఫ్ మూడో టెర్నినల్‌లో ఆగి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చైనా న్యూస్ ఏజెన్సీ షిన్హూ కూడా ఈ వార్తను ధ్రువీకరించిది. ఈ నౌక గల్ఫ్ దేశాలకు రవాణా చేస్తుందని అధికారులు అధికారులు పేర్కొన్నారు. ఈ పేలుడు నుంచి నౌక ఉద్యోగులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు.