
రష్యా విమానాశ్రయంపై డ్రోన్ల దాడి.. నుజ్జునుజ్జు అయిన నాలుగు విమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలోని ఎయిర్‌పోర్టుపై భారీ స్థాయిలో డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఊహించని రీతిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో నాలుగు రవాణా విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఆకస్మిక దాడితో రష్యాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే రష్యన్ ఆర్మీ సదరు డ్రోన్లపై ఎదురుదాడికి దిగాయి.
ఈ మేరకు స్థానిక గవర్నర్ మిఖాయిల్ వెడెర్నికోవ్ డ్రోన్ల దాడి ఘటనను ధ్రువీకరించారు. 4 ఇల్యూషిన్-76 మోడల్ విమానాలు నుజ్జు నుజ్జు అయ్యాయని, దాడి చేసిన క్రమంలో భారీగా మంటలు చెలరేగినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.
DETAILS
డ్రోన్ల దాడి ఘటనపై ఉక్రెయిన్ దేశం ఎటువంటి ప్రకటన చేయలేదు
మరోవైపు పోస్కోవ్ నగరం, ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 600 కి.మీల దూరంలోనే ఉండటం గమనార్హం. డ్రోన్ల దాడి ఘటనపై ఉక్రెయిన్ దేశం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఘటనకు సంబంధించిన వీడియోను స్థానిక గవర్నర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఇప్పుడు తాజాగా ఆగస్ట్ 30న రష్యాపై జరిగిన డ్రోన్ల దాడిని ఆ దేశం సీరియస్ గా తీసుకుంటోంది.
మరోవైపు దేశ రక్షణ కోసమే తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వేదికగా జరగనున్న G-20 సమ్మిట్ కు హాజరుకావట్లేదని అధికారికంగా ప్రకటన చేశారు.
ఇప్పుడు రష్యాపై డ్రోన్ల దాడిపై రష్యా ఎలా స్పందిస్తుందనేది కొసమెరుపు.