NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / MAGA: చైనా నుంచే 'మేగా' వస్తువులు.. ట్రంప్‌ ప్రచార వస్తువులపై చర్చలకు ఊతం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MAGA: చైనా నుంచే 'మేగా' వస్తువులు.. ట్రంప్‌ ప్రచార వస్తువులపై చర్చలకు ఊతం
    చైనా నుంచే 'మేగా' వస్తువులు.. ట్రంప్‌ ప్రచార వస్తువులపై చర్చలకు ఊతం

    MAGA: చైనా నుంచే 'మేగా' వస్తువులు.. ట్రంప్‌ ప్రచార వస్తువులపై చర్చలకు ఊతం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 14, 2025
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాషింగ్టన్‌ - అమెరికాను మళ్లీ మహాన్నగా చేయాలన్న నినాదంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవేశపెట్టిన MAGA (Make America Great Again) ప్రచారం మరోసారి దుమారానికి దారి తీసింది.

    తాజా సమాచారం ప్రకారం, ట్రంప్‌ ప్రచారంలో ఉపయోగించే బ్యానర్లు, ఫ్లాగ్స్‌ వంటి మెర్చండైజ్‌ 2016 నుంచే చైనాలో తయారవుతున్నాయని ఒక చైనా న్యూస్‌ చానెల్‌ వెలుగులోకి తెచ్చింది.

    చైనా న్యూస్‌ చానల్‌ 'చైనా 24' వెల్లడించిన వివరాల ప్రకారం, ట్రంప్‌ ప్రచార వస్తువులు ఒక్కటికి మొత్తం ఖర్చు కేవలం $1 (సుమారుగా రూ. 83) మాత్రమే.

    ఇదే సమయంలో ట్రంప్‌ అనేక ర్యాలీల్లో 'బాయ్‌ అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌' అంటూ ఓటర్లను ప్రోత్సహించిన వీడియోలు ఇప్పుడు తిరిగి వైరల్‌ అవుతున్నాయి.

    Details

     విలాసవంతమైన బ్రాండ్లు కూడా చైనాలోనే?

    అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని తరచూ పిలుపిచ్చిన ట్రంప్‌ తన ప్రచార వస్తువుల్ని చైనాలో తయారు చేయించడాన్ని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    చైనా కార్మికులు బిర్కిన్‌, లూయిస్ విటాన్‌, చానెల్‌, ఎస్టీ లాడర్‌, బాబీ బ్రౌన్‌ లాంటి ప్రముఖ విలాసవంతమైన బ్రాండ్ల ఉత్పత్తులను తాము తయారుచేస్తున్నామని వెల్లడించారు.

    ఎక్కువ ధరలకు వీటిని అమ్ముతూ ఇప్పుడు అదే వస్తువులను బ్రాండ్‌ లోగో లేకుండా ఒకటో పావుతొమ్మిదో ధరకు వినియోగదారులకు నేరుగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు.

    Details

    సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

    చైనా వర్క్‌షాపుల్లో నుండి తీసిన వీడియోలు ప్రస్తుతం సోష‌ల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    ఈ వీడియోల్లో కార్మికులు ఉత్పత్తిలో వాడే హై క్వాలిటీ మెటీరియల్స్‌, నైపుణ్యాన్ని వివరించడమే కాకుండా, దాటి పోకుండా ఖర్చు వివరాలు కూడా చెబుతున్నారు.

    కొందరు సప్లయర్లు ఫ్రీ షిప్పింగ్‌తో పాటు, దిగుమతి పన్నుల్ని కూడా తామే భరిస్తామని చెబుతున్నారు.

    ఈ మొత్తం ఘటన ఇప్పుడు అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల్లోని విపరీతాలను, ట్రంప్‌ పాలనలోని ద్వంద్వ విధానాలను వెలుగులోకి తీసుకువచ్చింది.

    ప్రజల్లో ఇది తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయాలపై అధికారిక స్పందన ఇప్పటివరకు లభించనప్పటికీ, ట్రంప్‌ ప్రచార భావజాలం వెనుక ఉన్న అసలైన వాణిజ్య లావాదేవీలపై చర్చ నడుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    ప్రపంచం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చైనా

    TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం!  అమెరికా
    China Population: 2024లో వరుసగా మూడో ఏడాది భారీగా తగ్గిన చైనా జనాభా అంతర్జాతీయం
    TikTok: అమెరికాలో టిక్‌టాక్‌ సేవలు తాత్కాలికంగా నిలిపివేత టిక్ టాక్
    China: అమెరికా డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్‌ నిర్ణయం: చైనా కీలక ప్రకటన  ప్రపంచ ఆరోగ్య సంస్థ

    ప్రపంచం

    Road Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది దుర్మరణం  రోడ్డు ప్రమాదం
    USA: ఉత్తర, దక్షిణ కరోలినాలో భయానక కార్చిచ్చు.. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు  అమెరికా
    Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు మునుపటిలాగే బలంగా ఉన్నాయ్.. మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్
    fighter plane: యుద్ధ విమానం అదృశ్యం.. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం ఫిలిప్పీన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025