Page Loader
Mehul Choksi: భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు 
భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు

Mehul Choksi: భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2025
08:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక మోసానికి సంబంధించి నిందితుడైన మెహుల్ చోక్సీ అరెస్టైనట్టు సమాచారం. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా బెల్జియం దేశంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ను మోసం చేసి వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని దేశం నుంచి పరారైన చోక్సీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు శనివారం అరెస్టయ్యారని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం అతను బెల్జియంలోని ఓ జైల్లో ఉన్నాడు.

వివరాలు 

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ₹13,500 కోట్ల భారీ రుణ మోసం 

చోక్సీ అరెస్టు సమయంలో ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్ ఎండ్ అరెస్ట్ వారెంట్లను అధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే, ఆరోగ్య సమస్యలు,ఇతర వ్యక్తిగత కారణాలను ఆధారంగా చూపుతూ అతను బెయిల్ కోసం అర్జి చేసే అవకాశం ఉందని సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ₹13,500 కోట్ల భారీ రుణ మోసానికి సంబంధించిన కేసులో చోక్సీ ప్రధాన నిందితుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తన భార్య ప్రీతీ చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్ నగరంలో నివసిస్తున్నాడు.

వివరాలు 

 2018 జనవరిలో దేశం విడిచిపెట్టిన చోక్సీ 

చోక్సీకి ఆంటిగ్వా అండ్ బార్బడోస్ దేశ పౌరసత్వం ఉంది. వైద్యం కోసం ఆ దేశాన్ని విడిచినట్లు సమాచారం. ఇదే కేసులో సహ నిందితుడైన అతడి మేనల్లుడు నీరవ్ మోడీని లండన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పీఎన్‌బీలో జరిగిన ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాక ముందు, 2018 జనవరిలోనే మెహుల్ చోక్సీ దేశం విడిచిపెట్టాడు.