బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టుల నుంచి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను 'బిగ్ డీల్' అంటూ వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ అభివర్ణించారు.
ప్రధాని మోదీ పర్యటన ముగింపులో ప్రెస్ ఈవెంట్‌లో పాల్గొంటున్నందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా ప్రెస్ నుంచి ఒక ప్రశ్న, భారతీయ జర్నలిస్ట్ నుంచి ఒక ప్రశ్న అడుగుతారని జాన్ కిర్బీ ఆయన చెప్పారు.
అమెరికా
ఎంపిక చేసిన రిపోర్టర్లకు మాత్రమే ప్రశ్నలు అడిగే అవకాశం
ప్రపంచ నాయకులతో వైట్‌హౌస్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లను చాలా కఠినతరం చేశారు.
నరేంద్ర మోదీ, జో బైడెన్ మీడియా సమావేశానికి శ్వేతసౌధం అధికారులు అమెరికన్, విదేశీ మీడియా నుంచి రిపోర్టర్‌లను ఎంపిక చేశారు. ప్రశ్నలు కూడా చాలా పరిమిత సంఖ్యలో ఉంటాయి.
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించారు.
పలువురు వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు మరియు ప్రముఖ వ్యక్తులను కూడా ఆయన కలిశారు. రెండోరోజు వైట్ హౌస్‌లో ప్రధాని మోదీకి బైడెన్ దంపతులు విందును ఏర్పాటు చేశారు.