LOADING...
Muhammad Yunus : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్ నాయతక్వం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్ నాయతక్వం

Muhammad Yunus : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్ నాయతక్వం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2024
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు నోటెల్ శాంతి పురుస్కార గ్రహిత మహ్మద్ యూనస్ ఎంపికయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాని షేక్ హసీనా తప్పుకోవాల్సి రావడంతో, అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం పార్లమెంట్ రద్దు చేశారు. ఇక కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. దీంతో మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా నియమిస్తున్నట్లు వెల్లడించారు.

Details

 మహ్మద్ యూనస్ పై 150పైగా కేసులు

పేదరిక నిర్మూలన కోసం మహ్మద్ యూనస్ చేసిన ఆధ్యయానికి నోబెల్ అవార్డు దక్కింది. ముఖ్యంగా మహిళలకు, పేదలకు పూచీకత్తు లేకుండా సుక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా పేదిరకాన్ని నిర్మూలించవచ్చని ఆయన వెల్లడించారు. మరోవైపు ఆయన ఆర్థిక అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయనపై 150పైగా కేసులు నమోదయ్యాయి.

Details

2007లో రాజకీయాల్లోకి ప్రవేశించిన మహ్మద్ యూనస్

2007లో మహ్మద్ యూనస్ సొంతంగా నాగోరిక్ శక్తి పార్టీని స్థాపించి బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. షేక్ హసీనా ప్రభుత్వంపై ఆయన మొదటి నుంచి పోరాడుతూనే వచ్చారు. 1940లో చిట్టగాంగ్‌లో యూనస్ జన్మించారు. ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి స్కాలర్ షిప్ పై వాండర్ బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. 1969లో పీహెచ్‌డీ పూర్తి చేసి, ఆర్థిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన కెరీయర్ ను మొదలు పెట్టారు.