Muhammad Yunus: నేడు బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్‌గా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం
బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్‌గా, బంగ్లాదేశ్ నోబెల్ శాంతి అవార్డు గ్రహిత మహ్మద్ యూనస్ ఇవాళ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. 15 మంది మంత్రులతో కలిసి కలిసి ఆయన ప్రమాణం స్వీకారం చేస్తారు. ఈరోజు రాత్రి 8 గంటలకు ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుందని ఆ దేశ మిలటరీ చీఫ్ చెప్పారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదివికి రాజీనామా చేసిన తర్వాత సైనిక పాలనలోకి ఆ దేశం వచ్చేసింది.
భారత్ లోనే షేక్ హసీనా
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లోనే ఆశ్రమం పొందుతున్నారు. ఆమె యూకేకు వెళ్లాలని నుకున్న అక్కడి నుంచి అనుమతి లభించకపోవడంతో భారత్ లోనే ఉండిపోయారు. మహ్మద్ యూనస్ పలు సేవా కార్యక్రమాల్లో వ్యక్తి కావడంతో పాటు బంగ్లాదేశ్‌లో పారిశ్రామికవేత్త కూడా కావడం అతనికి కలిసొచ్చింది. దీంతో ఆయన పేరును రాజకీయ పార్టీలతో చర్చించి ఖరారు చేశారు.