Mumbai attack mastermind: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు 78 ఏళ్ల జైలు శిక్ష.. వెల్లడించిన ఐక్యరాజ్యసమితి
ముంబై ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. అతను ఏడు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులలో శిక్షను ఎదుర్కొంటున్నాడని యూఎన్ తెలిపింది. 2008వ సంవత్సరంలో హఫీజ్ ను UN భద్రతా మండలి టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. అప్పటి నుండి సయీద్,పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్నాడు.
పంజాబ్ ప్రావిన్స్‌లో జైలులో మరణించిన భుట్టావి
12 ఫిబ్రవరి 2020 నుండి హఫీజ్ శిక్ష అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఉగ్రవాది హఫీజ్ ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధం, ఆయుధాలపై ఆంక్షలను భద్రతా మండలి విధించింది. 2008 ముంబై ఉగ్రదాడి కోసం LeT దాడి చేసిన వారికి శిక్షణనిచ్చి కనీసం రెండు పర్యాయాలు ఉగ్రవాద సంస్థ చీఫ్‌గా వ్యవహరించిన UN నియమించిన ఉగ్రవాది భుట్టావి, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేసినందుకు శిక్ష అనుభవిస్తూ గత ఏడాది మేలో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జైలులో మరణించాడు.