LOADING...
Elon Musk: ట్రంప్‌ సమక్షంలో మస్క్‌ విన్యాసం.. వైరల్ అవుతున్న వీడియో!
ట్రంప్‌ సమక్షంలో మస్క్‌ విన్యాసం.. వైరల్ అవుతున్న వీడియో!

Elon Musk: ట్రంప్‌ సమక్షంలో మస్క్‌ విన్యాసం.. వైరల్ అవుతున్న వీడియో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌(Elon Musk) తాజాగా చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. మస్క్‌ తన వేలికొనపై రెండు స్పూన్లు బ్యాలెన్స్‌ చేస్తూ చూపించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆశ్చర్యకరమైన ఈ క్షణాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) కూడా ఆయన పక్కనే కనిపించారు. ట్రంప్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక డిన్నర్‌లో మస్క్‌ తన భార్యతో కలిసి పాల్గొన్నారు. అదే సమయంలో ఆయన తన సీటులో కూర్చొని వేలికొనపై ఫోర్క్‌, రెండు స్పూన్లు బ్యాలెన్స్‌ చేస్తూ చూపించారు.

Details

వేలితో స్పూన్ల బ్యాలెన్స్

ఏ మాత్రం పడకుండా స్పూన్లను నిలబెట్టడం చూసి చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. మస్క్‌ నైపుణ్యాన్ని చూసి అక్కడి అతిథులు చప్పట్లు కొడుతూ అభినందించారు. ఈ వీడియోను స్వయంగా మస్క్‌ సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్ల నుంచి విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరు "ఎవరూ చేయలేని సాహసం చేశారు!" అంటూ సెటైరిక్‌గా స్పందించగా, మరికొందరు "టెక్‌ జీనియస్‌ అయినా సరే చిన్న చిన్న వినోదాలతో ఆకట్టుకోవడంలో మాస్టర్‌!" అంటూ ప్రశంసించారు. ఏదేమైనా, ఎలోన్ మస్క్‌ స్టైల్‌లో ఈ వీడియో మరోసారి అందర్నీ ఆకట్టుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో