Nawaz Sharif : భారత్‌పై నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు చంద్రుడిని చేరుకుంటే, మనం మాత్రం..
భారతదేశంపై పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇండియా చంద్రుడిపై కాలు మోపితే, మనం మాత్రం భూమి మీద కూడా సరిగ్గా ఎదగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పొరుగున ఉన్న దేశాలు చంద్రుడిపై కాలుమోపాయని, కానీ పాక్ మాత్రం భూమి మీదే ఎదగలేకపోతోందన్నారు. మనం ఇలాగే ఉండిపోకూడదని, మన పతనానికి మనమే కారణమయ్యాయమన్నారు. లేకపోతే మన దేశం మెరుగైన స్థితిలో ఉండేదని అన్నారు. ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్) కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికల్లో మనపై బలవంతపు ప్రభుత్వాన్ని(ఇమ్రాన్ ఖాన్) రుద్దారన్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు.