Israel: లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాల్లో రష్యా ఆయుధాలు: నెతన్యాహు
పశ్చిమాసియా ప్రస్తుతం ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉద్రిక్తంగా ఉంది. ఇటీవలి పరిణామాల్లో, ఇజ్రాయెల్ దళాలు హెజ్‌బొల్లాకు చెందిన సొరంగాలను కనుగొన్నారు. ఈ సొరంగాల్లో రష్యాకు చెందిన ఆయుధాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
హెజ్‌బొల్లా వందలాది సొరంగాలను తవ్వి వాటిని స్థావరాలుగా మార్చుకుంది: నెతన్యాహు
"దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై మా దళాలు చేసిన దాడుల్లో రష్యాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కనుగొన్నాం. 2006లో యూఎన్ భద్రతామండలి తీర్మానంలో, లిటాని నదికి దక్షిణంగా లెబనాన్ ఆర్మీకి మాత్రమే ఆయుధాలు కలిగివుండాలనేది స్పష్టంగా చెప్పబడింది. అయినప్పటికీ, హెజ్‌బొల్లా వందలాది సొరంగాలను తవ్వి వాటిని స్థావరాలుగా మార్చుకుంది. ఈ సొరంగాల్లోనే రష్యా ఆయుధాలు లభించాయి. లెబనాన్‌లో మరో అంతర్యుద్ధం ఉత్పత్తి కావడం విషాదకరం. మా లక్ష్యం ఎవరినైనా రెచ్చగొట్టడం కాదు. లెబనాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. మా సరిహద్దుల్లో ఉన్న పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడమే మా ప్రధాన లక్ష్యం," అని నెతన్యాహు పేర్కొన్నారు.
లెబనాన్‌లో సుమారు 1,373 మంది మృతి
గత నెలలో ఇజ్రాయెల్ దళాలు, ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై చేసిన దాడుల్లో రష్యా, చైనాకు చెందిన ఆయుధాలు కనుగొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్‌లో సుమారు 1,373 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.