ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం
న్యూయార్క్ నగరం ఆకాశహర్మ్యాల బరువు కారణంగా పాక్షికంగా మునిగిపోతోందని, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు వరద ముప్పు వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని 'ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ నగరం కచ్చితంగా మునిగిపోయే నగరమని, ప్రతి సంవత్సరం సగటున సుమారు 1-2 మిల్లీ మీటర్లు తగ్గుతుందని, న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాలు రెట్టింపు స్థాయిలో కుంగిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలోని వాతావరణ మార్పులు, హిమానీనదాలు కరిగిపోవడం వల్ల రెట్టింపు వేగంతో సముద్ర నీటి మట్టం పెరుగుతుండటంతో ఈ ముంపు మరింత తీవ్రతరం అవుతోంది. న్యూయార్క్ నగరం చుట్టూ నీటి మట్టం 1950నుంచి 9 ఇంచుల లేదా 22సెంటీమీటర్లు పెరిగింది.
న్యూయార్క్ నగరంలో 8.4 మిలియన్ల మంది ముంపు బాధితులు
న్యూయార్కు నగరంలో 10లక్షలకు పైగా ఆకాశాన్ని తాకే భారీ భవనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ భవనాల బరువు దాదాపుగా 76, 200కిలోలు ఉంటుందని, ఫలితంగా భూమి ఉపరితలంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతునట్లు పరిశోధనలో వెల్లడైంది. దీంతో న్యూయార్కు నగరంలో భూమి ఏటా సగటున 1 నుంచి 2 మిల్లీ మీటర్ల వరకు కుంగిపోతున్నట్లు పరిశోధకులు గుర్తంచారు. మరికొన్ని చోట్ల రెండు అడుగుల వరకు భూమి కుంచించుకోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో 8.4 మిలియన్ల మంది జనాభా వివిధ స్థాయిల్లో భూమి కుంగుబాటును ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.