
Nimisha Priya:నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు అవుతుంది.. కె.ఏ. పాల్ సంచలన వీడియో!
ఈ వార్తాకథనం ఏంటి
భారత నర్సు నిమిషా ప్రియాకు విధించిన మరణ శిక్షను రద్దు చేశారు. ఈ విజయానికి యెమెన్(Yemen),భారత నాయకుల నిరంతర కృషి ప్రధాన కారణమని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు డా. కే.ఏ. పాల్ మంగళవారం రాత్రి యెమెన్ రాజధాని సనా నుండి వీడియో సందేశం ద్వారా తెలిపారు.
వివరాలు
వీడియోలో డా. కే.ఏ. పాల్ మాట్లాడుతూ...
"ఇది దేవుని ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది" అని చెప్పారు. గత పది రోజులుగా రాత్రింబవళ్ళూ శ్రమించిన యెమెన్ నాయకులకు, అద్భుతమైన సహకారం అందించిన భారత అధికారులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిమిషా ప్రియాను సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు లాజిస్టిక్ ఏర్పాట్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ కేసులో భారత ప్రభుత్వం కూడా కీలక చర్యలు తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ(మీఈఏ) ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ప్రకారం, యెమెన్‌లో న్యాయ ప్రక్రియను ఎదుర్కొనేందుకు నిమిషా ప్రియాకు న్యాయవాదిని ఏర్పాటు చేయడమే కాకుండా, ఆమె కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. షరియా చట్టాల ప్రకారం క్షమాభిక్ష లేదా పరిహారం(Diya) ద్వారా పరిష్కారం సాధించే మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు వివరించారు.
వివరాలు
నిమిష ప్రియా విడుదల దిశగా సానుకూల పరిణామాలు
ఇదే సమయంలో, భారత గ్రాండ్ ముఫ్తీ ఖాంతాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ యెమెన్ మత పెద్దలతో చర్చలు జరిపారు. మానవతా దృష్టితో ఆమెను మతపరంగా కాకుండా ఒక మానవురాలిగా చూసి క్షమించాలంటూ మత పెద్దలను అభ్యర్థించారు. ఈ చర్చల తరువాతే నిమిషా ప్రియాకు విధించిన మరణ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వచ్చిన వార్తలను ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై గత వారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. నిమిషా ప్రియా శిక్షను తాత్కాలికంగా వాయిదా వేయడం ఊరట కలిగించిందని వ్యాఖ్యానించారు. యెమెన్‌లోని సంబంధిత అధికారులతో భారత ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో, ఆమె విడుదల దిశగా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
వివరాలు
దేశవ్యాప్తంగా నిమిషకు మద్దత్తు
యెమెన్ ప్రభుత్వం నర్సు నిమిషా ప్రియాపై విధించిన మరణ శిక్షను తాత్కాలికంగా నిలిపివేయడం వెనుక భారతీయ అధికారులు, మత నాయకులు, డా. కే.ఏ. పాల్ చేసిన అసాధారణ ప్రయత్నాల ఫలితంగా అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆమెకు న్యాయం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు అవుతుంది
BIG BREAKING NEWS. Indian Nurse Nimisha Priya from Sanaa , Yemen Prison will be released . English & Telugu . pic.twitter.com/oAbX5LABly
— Dr KA Paul (@KAPaulOfficial) July 21, 2025