జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కొరియా గురువారం జపాన్ తూర్పు సముద్రం వైపు పేరు తెలియని సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీని ధృవీకరించింది.
ఉత్తర కొరియా సైన్యాన్ని బలోపేతం చేయాలని ఆ దేశ నాయకుడు కిమ్ జంగ్ ఉన్ పిలుపునిచ్చారని, అందులో భాగంగానే క్షిపణుల ప్రయోగాలను వరసగా చేపడుతున్నట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్ కూడా స్పందించింది. దక్షిణ కొరియా-అమెరికా నిర్వహస్తున్న సైనిక విన్యాసాల నేపథ్యంలో పేరు తెలయని ప్యాంగ్యాంగ్ క్షిపణి తమ దేశంవైపు ప్రయాణించినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది.
ఉత్తర కొరియా క్షిపణి బహుశా హక్కైడో ప్రిఫెక్చర్‌లో లేదా సమీపంలోని నీటిలో పడిపోయి ఉండొచ్చని జపాన్ పేర్కొంది.
జపాన్
ఈ ఏడాది ఇప్పటి వరకు 30 క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
దక్షిణ కొరియా-యునైటెడ్ స్టేట్స్ నిర్వహిస్తున్న సైనిక కసరత్తులకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా ఈ సంవత్సరం సుమారు 30 క్షిపణులను ప్రయోగించింది.
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపంలో నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా జపాన్, కొరియా ద్వీపకల్పం మధ్య జలాల వైపు వెళ్లినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ తెలిపారు.
దీంతో ప్రిఫెక్చర్, సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ క్షిపణిని మధ్యస్థ లేదా సుదూర శ్రేణి అని చెప్పుకుంటారు.
అయితే అది ఎంత దూరం ప్రయాణించిందనేది స్పష్టంగా తెలియరాలేదని ప్రముఖ్య న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.