North Korea : మళ్లీ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా.. రెచ్చగొడితే అణుదాడి తప్పదన్న కిమ్ జాంగ్ ఉన్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరకొరియా మరోసారి క్షిపణ పరీక్షలు చేపట్టింది. ఈ మేరకు తమను అణుదాడితో రెచ్చగొడితే వాటి ప్రయోగానికి వెనుకాడబోమని కిమ్ జోంగ్ ఉన్ అల్టిమేటం ఇచ్చాడు.
ఈ మేరకు ఇవాళ మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి(icbm) మాక్ డ్రిల్ లాంఛ్ చేశారు.
ఈ సందర్భంగా సైనికులతో కలిసి నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యర్థులు అణుబాంబులతో రెచ్చగొడితే, తాము సైతం అణు బాంబులను ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ జొంగ్ ఉన్ సూచించినట్టు ఆ వార్త సంస్థ కథనం ప్రసారం చేసింది.
చర్చల్లో పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
details
గత వారమే ఆ దేశాల మధ్య కీలక సమావేశం
అయితే, గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణ కొరియా దేశాల మధ్య కీలక సమావేశం జరిగింది.
ఉత్తర కొరియాతో యుద్ధం తలెత్తిన సందర్భంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ సాగింది.
ఉత్తర కొరియా తమపై అణుబాంబు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందని ఉభయ దేశాలూ ఈ భేటీ తర్వాత ఘాటుగా వ్యాఖ్యానించాయి.
ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో కిమ్ జోంగ్ ఉన్ పాల్గొనాలని ఆయా దేశాలు స్పష్టం చేశాయి.
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడి తాజా హెచ్చరికలతో అమెరికా, దక్షిణ కొరియా, దాని మిత్రపక్షాలు స్పందనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మరోసారి పాత పాటే పాడిన కిమ్ జోంగ్ ఉన్
North Korea just released a video launching a massive ballistic missile. This might force the US navy to stay in the east rather than harass the Houthis.
— Syrian Girl 🇸🇾🎗 (@Partisangirl) December 20, 2023
FYI North Korea doesn’t recognise the state of Israel. pic.twitter.com/ehaQaBPHsA