మరోసారి దక్షిణ కొరియాపై రగిలిపోతున్న ఉత్తర కొరియా.. సౌత్ కొరియా లక్ష్యంగా న్యూక్లియర్ డ్రిల్స్
కొరియన్ దేశాల్లో అలజడులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు దక్షిణకొరియాపై ఉత్తర కొరియా రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ కొరియాను నామరూపాల్లేకుండా చేయడమే ధ్యేయంగా న్యూక్లియర్ డ్రిల్స్ ను చేపట్టింది. దక్షిణ కొరియాపై ప్రతీకారంతో ఉన్న ఉత్తర కొరియా, బీ-1B బాంబర్లను అమెరికా మోహరించిన కొద్ది గంటల్లోనే న్యూక్లియర్ డ్రిల్స్ చేపట్టింది. ఈ క్రమంలోనే రెండు బాలిస్టిక్ క్లిపణులను ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. క్షిపణి, అణ్వస్త్ర పరీక్షలతో నిత్యం బిజీ బీజీగా గడిపే ఉత్తర కొరియా, తన ఆగర్భ శత్రుదేశంగా భావించే దక్షిణ కొరియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు రగిలిపోతోంది. ఇందుకోసమే స్కోర్చ్‌డ్-ఎర్త్ అణుదాడి డ్రిల్స్ నిర్వహించినట్లు దక్షిణ కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.
నార్త్ కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది : దక్షిణ కొరియా
మరోవైపు అమెరికా ముందస్తు అణుదాడి ప్రణాళికలను తిప్పి కొట్టే క్రమంలోనే వ్యూహాత్మకంగా దాడులు జరిపినట్లు వివరించింది. నార్త్ కొరియా క్షిపణి యూనిట్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని పేర్కొంది. సముద్రంలోకి ఉత్తర కొరియా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను బుధవారం ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. మిత్ర రాజ్యాల కసరత్తుల కోసం అమెరికా బీ-1B బాంబర్లను మోహరింపు నేపథ్యంలోనే నార్త్ కొరియా దుందుడుకు చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం న్యూక్లియర్ డ్రిల్‌ను పరిశీలించడం గమనార్హం.