Trump:'మా అనుమతి లేకుండా ఏమీ చేయలేరు'.. మస్క్‌కు ట్రంప్ క్లియర్ మెసేజ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
వైట్‌హౌస్ ఇప్పటికే ఆయనను ఒక ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా పేర్కొంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనకుండి నడిపిస్తున్నట్లు కొన్ని ఆరోపణలు వెలువడుతున్నాయి.
ఆ సందర్భంలో మస్క్ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్ట్‌లు పలు సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Details
స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు
మస్క్ ప్రభుత్వపరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోలేరని, "మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు.. చేయలేరు కూడా..!" అని ట్రంప్ చెప్పారు.
ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో, ఎలాన్ మస్క్ ట్రంప్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తన పాలకవర్గంలో మస్క్‌ను చేరవేసుకున్నారు. డోజ్‌కి సారథిగా ఆయనను నియమించారు.
ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, వ్యయాలు తగ్గించడం ఈ నియామకానికి ముఖ్య ఉద్దేశం.
అయితే, మస్క్ తన పాత్రలో అతి ఎక్కువగా జోక్యం చేసుకునే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.