Page Loader
USA: 2023 నుండి అమెరికాలో 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లు
2023 నుండి అమెరికాలో 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లు

USA: 2023 నుండి అమెరికాలో 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా, అమెరికా హౌస్‌ కమిటీ "వలస చట్టాల అమలును పునరుద్ధరించడం" పై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు.సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ స్టడీస్‌కు చెందిన జెస్సీకా ఎం. వాఘన్ కమిటీ దృష్టికి తీసుకువచ్చిన సమాచారం ప్రకారం, 2023లో వీసా గడువు ముగిసినా 7,000 మంది భారతీయ విద్యార్థులు,ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లు అమెరికాలోనే ఉండిపోయారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు,స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లలో 20% కి పైగా వీసా గడువు ముగిసినా అమెరికాను వీడలేదని ఆమె వివరించారు. ఎఫ్‌ (F),ఎం(M)కేటగిరీల్లో వీసాలు పొందినవారే ఎక్కువగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

వివరాలు 

విద్యార్థి వీసాల ప్రయోజనాలు 

అమెరికా స్కూల్స్‌, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి విద్యార్థిలా చదవడానికి ఎఫ్‌-1 (F-1) వీసాలు జారీ చేస్తారు. వీటిని సెమినార్లు, భాషాపై శిక్షణ కార్యక్రమాలకు కూడా వినియోగిస్తారు. ఎం-1 (M-1) వీసాలు ప్రధానంగా వృత్తి విద్యా కోర్సులు, నాన్‌-అకడమిక్‌ అవసరాలు, భాషా శిక్షణ కోర్సుల కోసం ఉపయోగిస్తారు.

వివరాలు 

అక్రమంగా ఉంటున్న విద్యార్థులు 

బ్రెజిల్‌, చైనా, కొలంబియా, భారత్‌ వంటి దేశాలకు చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉంటున్నారని వెల్లడించారు. ఇందులో అత్యధికంగా 7,000 మంది భారతీయ విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వీసా విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానాన్ని బలోపేతం చేయాలని ఆమె సూచించారు. జెస్సీకా వాఘన్‌ మాట్లాడుతూ, "చట్టంలో కాంగ్రెస్‌ పలు సవరణలు చేయాలి. విద్యార్థి వీసాలకు ద్వంద్వ ఉద్దేశాలను వర్తింపజేయకూడదు. ప్రతి విద్యార్థి చదువు పూర్తయిన వెంటనే స్వదేశానికి వెళ్లటానికి సిద్ధంగా ఉండాలి" అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

75,000 లోపే వీసాలు - హెచ్‌-1బీ వీసాల గడువు తగ్గింపు 

హెచ్‌-1బీ (H-1B) వీసాలకు కేవలం రెండేళ్ల గడువు మాత్రమే ఉండాలని, అత్యవసరమైన సందర్భాల్లో నాలుగేళ్లకు పొడిగించే అవకాశం కల్పించాలని జెస్సీకా సూచించారు. గ్రీన్‌కార్డు పిటిషన్ల ఆధారంగా ఆటోమేటిక్‌ పొడిగింపులు అనుమతించకూడదని కమిటీకి నివేదిక సమర్పించారు.

వివరాలు 

ఆమె పేర్కొన్న ఇతర ముఖ్యమైన సూచనలు: 

రీసెర్చ్, నాన్‌-ప్రాఫిట్‌ సహా వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలి. ప్రస్తుతం వీటికి ఎలాంటి పరిమితి లేకపోవడం వల్ల వీసా దుర్వినియోగం జరుగుతోందని తెలిపారు. వీసా సబ్‌స్క్రిప్షన్లు అధికమైతే, అత్యధిక వేతనాలు చెల్లించే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని ద్వారా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారికి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం, పరిమిత సంఖ్యలో మాత్రమే వీసాలు మంజూరు చేయాలి. అమెరికాలో ఉద్యోగాలు చాలానే ఉన్నప్పటికీ, ఒక్క STEM డిగ్రీలు పూర్తి చేసినవారిలోనే 20 లక్షల మంది ఉద్యోగాలకతీతంగా ఉన్నారని గుర్తుచేశారు. ఈ మార్పుల ద్వారా అక్రమ వలసదారులను అరికట్టే విధంగా వీసా విధానాన్ని పటిష్టం చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.