Page Loader
US: పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా
పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా

US: పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. ఈ దాడిని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. తాజాగా దీనిపై అమెరికా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. భారత్‌-పాక్‌లకు అమెరికా సూచన ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకొచ్చేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని మేం ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

Details

పాక్‌ వాదనలు - చైనా మద్దతు 

పహల్గాం దాడిపై తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్‌ మళ్లీ మళ్లీ బుకాయిస్తోంది. ఈ దాడిపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలని పాక్‌ డిమాండ్‌ చేస్తోంది. పాక్‌ వాదనకు చైనా మద్దతు తెలుపుతోంది. చైనాకు చెందిన విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌-పాక్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్న వాంగ్‌ యీ, పహల్గాం ఉగ్రదాడిపై నిష్పక్షపాతమైన దర్యాప్తును మద్దతు ఇస్తామని పాక్‌కు హామీ ఇచ్చారు.