Pakistan: లాహోర్ సిటీలో దారుణంగా రికార్డైన ఏక్యూఐ.. భారత్‌ను నిందించిన పాక్
పాకిస్థాన్ మరోసారి భారత్ పై ఆరోపణలు గుప్పించింది. భారతదేశమే తమ దేశంలో కాలుష్యానికి కారణమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి, ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా శీతాకాలంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అసాధారణ స్థాయికి చేరుకుంటుంది. అయితే, పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో కూడా వాయు కాలుష్యం ఇటీవల అత్యధికంగా నమోదైంది.
పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్ కు చేరి..
అక్కడ, ఏక్యూఐ 1,067 పాయింట్లను రికార్డు చేసింది.ఈ సందర్భంగా, మంత్రి మరియం ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ, "లాహోర్ లో వాయు కాలుష్యం పెరగడానికి భారతదేశం లోని పంజాబ్ నుంచి వచ్చే గాలులు కారణమని" విచిత్రమైన ఆరోపణలు చేసారు. గాలి వేగం,దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్ కు చేరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)దారుణంగా పెరిగిందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా, ఆదివారం లాహోర్ లో ఏక్యూఐ 500 పాయింట్ల చుట్టూ ఉందని తెలిపారు. అయితే, ఈ విషయంలో పాకిస్థాన్ చేయగలిగింది ఏమి లేదని పేర్కొంది. "వీచే గాలిని ఆపడం కుదరదు. ఈ సమస్యకు పరిష్కారం దేశాల మధ్య చర్చల ద్వారా మాత్రమే సాధ్యం" అని వివరించారు.