
Pahalgam Attack: సింధు జలాల ఒప్పందం రద్దు.. స్పందించిన పాక్
ఈ వార్తాకథనం ఏంటి
పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై కేంద్రప్రభుత్వం గట్టిగా స్పందించింది.
ముఖ్యంగా సింధూనదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సరిహద్దు ఉగ్రవాదానికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టే వరకు,పాకిస్థాన్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని అమలు చేయబోమని బుధవారం కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
ఇందుకు సంబంధించి భారత్ తీసుకున్ననిర్ణయంపై పాకిస్థాన్ తాజాగా స్పందించింది.
భారత్ ఈవిధంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా"జలయుద్ధానికి" పాల్పడుతోందని ఆరోపించింది.
అంతేకాదుఇది చట్టపరంగా తగని చర్య అని అభివర్ణించింది.ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఏర్పడిన ఈఒప్పందం నుంచి భారత్ ఒక్కపక్షంగా బయటకు వెళ్లలేదని పేర్కొంటూ,సింధూ నదిలో ఉన్న ప్రతి నీటి బొట్టుపై తమ హక్కు ఉందని ఆదేశం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని చట్టపరంగా సవాల్ చేస్తామని స్పష్టం చేసింది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వం పలు దిశల్లో కీలక నిర్ణయాలు
ఈ నేపథ్యంలో,మంగళవారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం పెహల్‌గామ్‌లో ఉగ్రవాదులు అతి దారుణంగా దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ భయానక ఘటనలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు దారితీసింది.కశ్మీర్ లోయ మొత్తం ఉలిక్కిపడింది.
ఈ దాడికి కౌంటర్‌గా కేంద్ర ప్రభుత్వం పలు దిశల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ,పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవాలని కఠినంగా వ్యవహరించడంలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.