NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది
    ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది

    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 18, 2025
    02:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) భారీ ఒత్తిడి పెడుతోంది.

    తాజా నివేదిక ప్రకారం, ఐఎంఎఫ్ పాకిస్తాన్‌పై మరో 11 ఆర్థిక షరతులను విధించింది. దీంతో పాకిస్తాన్‌పై ఇప్పటివరకు IMF విధించిన మొత్తం షరతుల సంఖ్య 50కి చేరింది.

    IMF నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్లుగా ప్రణాళిక వేస్తోంది, ఇది గత ఏడాదితో పోల్చితే రూ.252 బిలియన్లు లేదా 12% పెరుగుదలగా ఉంది.

    భారత్ మే 7న 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినప్పటికీ, పాకిస్తాన్ మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై దాడి ప్రయత్నాలు చేసింది.

    Details

    కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి

    నాలుగు రోజుల పాటు క్రాస్-బోర్డర్ డ్రోన్, మిసైల్ దాడులు కొనసాగడంతో మే 10న భారత్, పాకిస్తాన్ మధ్య అవగాహన ఏర్పడింది.

    IMF కొత్త షరతుల ప్రకారం జూన్ 2025 నాటికి IMF లక్ష్యాల అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది.

    అదే సమయంలో నాలుగు రాష్ట్రాలు జూన్ నెలలో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి.

    దీనికి సంబంధించి పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచారం, అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది.

    IMF సూచనల ప్రకారం గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేత చర్యల ప్రణాళికను కూడా ప్రభుత్వము ప్రచురించాలి.

    Details

    ఏడాది చివరిలోగా నివేదిక సమర్పించాలి

    2027 తర్వాత ఆర్థిక రంగ పరిపాలన, నియంత్రణకు సంబంధించిన ప్రణాళికను రూపొందించడం కూడా అవసరం. ఎనర్జీ రంగంలో కూడా IMF కొత్త షరతులు విధించింది.

    ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, మే నెలాఖరులోపు ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాల్సి ఉంది.

    ఇక 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాలని IMF కోరింది. దీనికి సంబంధించిన నివేదికను ఈ ఏడాది చివర్లో సమర్పించాలని చెప్పింది.

    ఇవి కాకుండా జూలై చివర నాటికి వాణిజ్య ప్రయోజనాల కోసం 5 సంవత్సరాల లోపు వయస్సున్న వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని సూచన ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఎంఎఫ్
    పాకిస్థాన్
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్

    ఐఎంఎఫ్

    పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్ పాకిస్థాన్
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ చైనా
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు  ఆర్ బి ఐ
    పాకిస్థాన్‌కు భారీ ఊరట.. 3 బిలియన్‌ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్‌ గ్రీన్ సిగ్నల్ పాకిస్థాన్

    పాకిస్థాన్

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ క్రీడలు
    Pakistan:భారత్‌ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్‌ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్ అంతర్జాతీయం
    Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్ భారతదేశం
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ సోదరుడు.. IC-814 హైజాక్‌ మాస్టర్‌మైండ్‌ రవూప్‌ అజహర్‌ హతం..!  అంతర్జాతీయం
    INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ  భారతదేశం
    High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు భారతదేశం
    Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025