Page Loader
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందింది. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవనున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), ఐఎస్ఐఎస్ (ISIS), బలూచిస్తాన్‌కు చెందిన ఇతర ఉగ్రవాద గ్రూపులు ఈ కుట్రకు పాల్పడుతున్నట్లు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వెల్లడించినట్లు సమాచారం. ఈ కుట్రలో ప్రధానంగా విదేశీ అతిథులే లక్ష్యంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు ఈ కుట్రకు తెరతీశాయని హెచ్చరించింది.

వివరాలు 

2009లో జరిగిన ఉగ్రదాడి

ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాల వల్ల భారత్ పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. ఈ కారణంగా భారత మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చారు. ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలు ఇంజమామ్-ఉల్-హక్, రమీజ్ రాజా, మిస్బా-ఉల్-హక్ మాట్లాడుతూ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాముఖ్యతను వివరించారు. 2009లో జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ క్రికెట్‌ను ఎలా ప్రభావితం చేసిందో గుర్తు చేశారు. ఈ దాడుల కారణంగా పాకిస్థాన్ క్రికెట్‌కు 10 సంవత్సరాల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.

వివరాలు 

టోర్నమెంట్‌లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లే పాల్గొంటాయి 

"ఈ టోర్నమెంట్‌ను 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. 2009 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ టోర్నమెంట్‌ను నాలుగు సంవత్సరాలకోసారి నిర్వహించేలా మార్చారు. ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లే ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి" అని ఐసీసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 2008లో పాకిస్థాన్‌లో జరగాల్సిన షెడ్యూల్‌ను రద్దు చేసి దక్షిణాఫ్రికాలో నిర్వహించారు.