Page Loader
Chenab dam project: ఇక పాక్‌కు నీటి కష్టాలే.. క్వార్ డ్యామ్‌ పనులు వేగవంతం!
ఇక పాక్‌కు నీటి కష్టాలే.. క్వార్ డ్యామ్‌ పనులు వేగవంతం!

Chenab dam project: ఇక పాక్‌కు నీటి కష్టాలే.. క్వార్ డ్యామ్‌ పనులు వేగవంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా-పాకిస్థాన్ దేశాల మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. భారత్‌ చినాబ్ నదిపై నిర్మిస్తున్న క్వార్ డ్యామ్‌ పనుల వేగాన్ని మళ్లీ పెంచేందుకు కీలక అడుగులు వేస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.3,119 కోట్ల రుణం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలోని ఛెనాబ్ వాలీ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (CVPPL) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. ఏప్రిల్‌లో పహల్గామ్‌లో పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడిలో 26 మందిని హత్య చేశారు. దీంతో భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా.. పాక్‌ దిగ్భ్రాంతికి లోనైంది. ఈ ఒప్పందం 1960లో కుదుర్చుకుంది.

Details

పాక్‌కు ఎదురు దెబ్బ

ఇండియాతో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 9-12 టెర్రర్ క్యాంపులపై భారత్ బలంగా దాడులు చేయగా.. పాక్‌ బదులుగా భారత సరిహద్దు నగరాలపై దాడులు చేసింది. కానీ భారత వాయుసేన కౌంటర్ దాడులతో పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డ్యామ్‌ పనుల్లో వేగం పెంచేందుకు భారీ రుణం 540 మెగావాట్ల సామర్థ్యం గల క్వార్‌ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.4,526 కోట్ల వ్యయాన్ని అంచనా వేసిన భారత ప్రభుత్వం.. అందులో భాగంగా రూ.3,119 కోట్ల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ సంస్థలతో సంప్రదింపులు చేపట్టింది. 2024 జనవరిలో చనాబ్ నదిని మళ్లించడం పూర్తవడంతో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

Details

2027లో పూర్తయ్యే ప్రాజెక్టు.. ప్రతిష్టాత్మక లక్ష్యంగా

కిష్త్వార్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో, 109 మీటర్ల ఎత్తుతో కాంక్రీటు గ్రావిటీ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తి అయితే ఏటా 1,975 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ 2022లో భూమిపూజ చేశారు. 2027 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో కేంద్రం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. భద్రత, శక్తి.. రెండింటికీ కీలకం ఈ ప్రాజెక్టు దేశ విద్యుత్ అవసరాలే కాకుండా జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి భారీగా లాభాలు కలిగించనుంది. పరిశ్రమల అభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టు.. పాకిస్తాన్‌కు భద్రత పరంగా ఘాటు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.