Pakistan: ఉదంపూర్ దాడి సూత్రధారి.. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సహాయకుడు హతం
2015లో జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి సూత్రధారి అయిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది హంజ్లా అద్నాన్‌ను పాకిస్థాన్‌లోని కరాచీలో గుర్తు తెలియని ముష్కరులు హతమార్చారు. 26/11 ముంబై దాడుల సూత్రధారి LeT చీఫ్ హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడిగా పరిగణించబడుతున్న హంజ్లా అద్నాన్ డిసెంబర్ 2- 3 మధ్య రాత్రులలో అతని ఇంటి వెలుపల కాల్చి చంపబడ్డాడు. అతనికి నాలుగు బుల్లెట్లు తగిలాయి. లష్కరే ఉగ్రవాదిని పాకిస్థాన్ సైన్యం రహస్యంగా కరాచీలోని ఆసుపత్రికి తరలించిందని వర్గాలు మీడియాకి తెలిపాయి.
2016 పాంపోర్ ప్రాంతంలో CRPF కాన్వాయ్‌పై ఉగ్ర దాడి
తీవ్రగాయాలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 5న మరణించారు. ఇటీవల,హంజ్లా అద్నాన్ తన ఆపరేషన్ స్థావరాన్ని రావల్పిండి నుండి కరాచీకి మార్చారు. 2015లో, హంజ్లా అద్నాన్ ఉధంపూర్‌లో BSF (సరిహద్దు భద్రతా దళం) కాన్వాయ్‌పై దాడికి సూత్రధారి, ఇందులో 2 BSF సైనికులు మరణించగా.. 13 మంది జవాన్లు గాయపడ్డారు. బీఎస్ఎఫ్ కాన్వాయ్ దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసింది. 2016లో జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలో CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడికి అగ్రశ్రేణి LeT ఉగ్రవాది సమన్వయం చేశాడు. ఈ దాడిలో 8 CRPF సైనికులు మరణించగా 22 మంది గాయపడ్డారు.