
shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ పై గట్టి ఎదురుదాడిగా నిలిచింది. అయితే, ఈ దాడికి సంబంధించిన నిజాలను దాచి, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం తప్పుడు ప్రకటనలతో అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. భారత్‌పై విజయం సాధించామన్నట్లు అవాస్తవ వాఖ్యాలతో ప్రజల్లో భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కరాచీలో పర్యటించిన సమయంలో షెహబాజ్ మాట్లాడుతూ,తమ దేశానికి చెందిన నావికా దళం,వైమానిక దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలను కొనియాడారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ తమ దేశానికి కేవలం 400 నాటికల్ మైళ్ల దూరంలోకి వచ్చినప్పుడు,తమ వైమానిక దళం దాడిచేసి దానికి తీవ్ర నష్టం కలిగించిందని పేర్కొన్నారు.
వివరాలు
100 మందికి పైగా ఉగ్రవాదులు హతం
కానీ ఇది పూర్తిగా అబద్దమేనని భారత రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. వాస్తవానికి,పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మిసైళ్లు ప్రయోగించి,వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అని అధికారికంగా ప్రకటించబడింది. మరోవైపు, పాకిస్తాన్ మాత్రం భారత సైన్యం వ్యవహరిస్తున్న శాంతిమార్గాన్ని విస్మరించి,అక్కడి ప్రజల నివాస ప్రాంతాలపై డ్రోన్లు,క్షిపణులతో దాడులకు పాల్పడింది. అయితే,భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాదు,పాకిస్తాన్‌కు చెందిన ఐదు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడుల ప్రభావంతో పాక్ భయభ్రాంతులకు లోనై,చివరికి భారత్‌తో కాల్పుల విరమణకు ఒప్పుకుంది. భారత్ పక్కా మిలిటరీ వ్యూహాలతో,అత్యాధునిక ఆయుధాలతో చూపించిన ప్రతిఘాతం వల్ల పాకిస్తాన్ వెనక్కి తగ్గక తప్పలేదు.