Pakistan shooting: పాకిస్థాన్‌లో దారుణం.. సాయుధుడి కాల్పులలో 20 మంది మృతి.. ఏడుగురికి గాయాలు
పాకిస్థాన్‌లోని ఒక బొగ్గు గనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాయుధుడు 20 మంది బొగ్గు గనిలోని ఉద్యోగులను కాల్చి చంపాడు. ఈ దారుణం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరణ ప్రకారం, బలూచిస్తాన్‌లోని దికీ జిల్లా బొగ్గు గనిలో ఉన్న వసతిగృహాల్లోకి సాయుధులు చొరబడ్డారు. అక్కడ ఉన్న ఉద్యోగులను చుట్టుముట్టి, వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఎక్కువమంది పష్తున్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్తాన్ కు చెందినవారని పోలీసులు తెలిపారు.
ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం
ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లోని ప్రధాన విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడులు కూడా మరువలేని ఘటన. ఇక వచ్చే వారంలో ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ తరచుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి.