LOADING...
TikTok Meets Terror: టిక్‌టాక్‌ వీడియో కోసం సింహం బోనులోకి.. పాకిస్థాన్ వ్యక్తికి తీవ్ర గాయాలు 
టిక్‌టాక్‌ వీడియో కోసం సింహం బోనులోకి.. పాకిస్థాన్ వ్యక్తికి తీవ్ర గాయాలు

TikTok Meets Terror: టిక్‌టాక్‌ వీడియో కోసం సింహం బోనులోకి.. పాకిస్థాన్ వ్యక్తికి తీవ్ర గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

సింహాన్ని (Lion) దూరం నుంచి చూసినా వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా దాని బోనులోకి ప్రవేశించి ఎదుర్కొన్నాడు. టిక్‌ టాక్‌ వీడియో కోసం (TikTok Video) తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో (Pakistan) చోటుచేసుకుంది. పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ముహమ్మద్‌ అజీమ్‌ లాహోర్‌ సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడే బోనులో ఉన్న సింహంతో టిక్‌టాక్‌ వీడియో తీయాలని నిర్ణయించాడు. అనుమతి లేకుండా సంరక్షకుడికి తెలపకుండా, నేరుగా బోనులోకి ప్రవేశించాడు. దాంతో, సింహం వెంటనే అతడిపై దాడికి దిగింది.

వివరాలు 

 ఘటనపై స్పందించిన పంజాబ్‌ మంత్రి మరియం ఔరంగజేబు

సింహం దాడిలో తీవ్రంగా గాయపడిన అజీమ్‌ గట్టిగా కేకలు పెట్టాడు. సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతడిని రక్షించారు. గాయాల తీవ్రతతో బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతను చికిత్స పొందుతున్నప్పటికీ, అతడి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్‌ మంత్రి మరియం ఔరంగజేబు స్పందించారు. సంబంధిత యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌ యజమాని బ్రీడింగ్‌ లైసెన్సును రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ జంతు సంరక్షణ కేంద్రంలో ఉన్న జంతువుల వీడియోలు, ఫోటోలు టిక్‌టాక్‌ లేదా ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచురించడంపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ, అజీమ్‌ నిబంధనలను ఉల్లంఘించాడు.