Page Loader
పాకిస్థాన్‌: తాత్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్య
పాకిస్థాన్‌: తాత్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్య

పాకిస్థాన్‌: తాత్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్య

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2023
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేశాక తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమైన సంగతి తెలిసిందే. తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడం ఇప్పుడు సంచలనం అయ్యింది. జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (JKLF) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ భార్య కి పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చారు. కాశ్మీరీ వేర్పాటువాదం కోసం యాసిన్ మాలిక్‌ తీవ్రవాద నిధుల కేసుల్లో భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు యాసీన్ కు 2022 వ సంవత్సరం మే 25వతేదీన జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం యాసీన్ భార్య అయిన మిషాల్ హుస్సేన్ మాలిక్ పాకిస్థాన్ మానవ హక్కుల మంత్రిగా నియమించారు.

Details 

తాత్కాలిక ప్రధానితో బాటు పదహారు మంది ప్రమాణస్వీకారం 

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ గురువారం తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ కేబినెట్ సభ్యులతో ప్రమాణం చేయించారు. పాకిస్థన్ తాత్కాలిక ప్రధానితో బాటు పదహారు మంది సమాఖ్య మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా జలీల్ అబ్బాస్ జిలానీ, లెఫ్టినెంట్ జనరల్ (ఆర్) అన్వర్ అలీ హైదర్, ముర్తజా సోలంగి సమీ సయీద్, షాహిద్ అష్రఫ్ తరార్, అహ్మద్ ఇర్ఫాన్ అస్లాం, ముహమ్మద్ అలీ, గోహర్ ఎజాజ్, ఉమర్ సైఫ్, నదీమ్ జాన్, ఖలీల్ జార్జ్, అనీఖ్ అహ్మద్, జమాల్ షా, మదాద్ అలీ సింధీ ప్రమాణ స్వీకారం చేశారు.