పాకిస్థాన్‌లో లైవ్ టీవీ డిబెట్ రచ్చరచ్చ.. ఇమ్రాన్ ఖాన్ కోసం తుక్కు రెగొట్టుకున్న నేతలు
పాకిస్థాన్‌లో లైవ్ టీవీ డిబెట్ జరుగుతుండగా నేతలు డిష్యుం డిష్యుం చేసుకున్నారు. చర్చల్లో భాగంగా జరిగిన వాదనలు, ఆరోపణలు, విమర్శలు వేడెక్కాయి. దీంతో పరిస్థితులు చేయి దాటాయి. ఈ క్రమంలోనే భౌతిక దాడులు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ నేత, న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పీఎంఎల్ పార్టీ సెనేటర్ అఫ్నాన్ ఉల్లా తీవ్రస్థాయిలో తన్నుకున్నారు. తొలుత ఇమ్రాన్ పై సెనేటర్ అఫ్నాన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేయగా, సహనం కోల్పోయిన షేర్ అఫ్జల్ మార్వత్ కుర్చీలో నుంచి లేచి అఫ్నాతుల్లా ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టాడు.దీంతో ఖాన్, మార్వత్‌పై ప్రతిదాడి చేశాడు. యాంకర్, సిబ్బంది వీరిని అడ్డుకోగా, అప్పటికే అఫ్నాన్ ఖాన్ తలకు గాయమైంది.