
Pakistan-China: చైనా పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడు జార్దారీ … రక్షణ బంధం మరింత బలపడుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్దారీ చైనానాకు 10 రోజుల పర్యటనను ప్రారంభించారు. ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ల ఇటీవల జరిగిన ఐదు రోజుల పర్యటనల తర్వాత ఈ సందర్శన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. AVIC సందర్శన జార్దారీ తన పర్యటనలో భాగంగా చెంగ్డూలోని చైనా ప్రభుత్వ రక్షణ రంగ దిగ్గజం 'ఎవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా' (AVIC) ఆధునిక ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఒక విదేశీ దేశాధినేత మొదటిసారిగా ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టడం విశేషంగా మారింది.
Details
సాంకేతిక ప్రదర్శన
ఈ సందర్భంగా జార్దారీకి J-10 ఫైటర్ జెట్, పాకిస్తాన్‌తో కలసి ఉత్పత్తి చేసిన JF-17 థండర్, అలాగే అభివృద్ధి దశలో ఉన్న J-20 స్టెల్త్ ఫైటర్ పై వివరాలు అందించారు. అదనంగా డ్రోన్లు, ఆటోమేటెడ్ యూనిట్లు, ఆధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్‌ను చూపించారు. AVICను ఆయన 'చైనాకు చెందిన సాంకేతిక పురోగతికి ప్రతీక, పాకిస్తాన్-చైనా వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనం'గా అభివర్ణించారు.
Details
రక్షణ బంధం మరింత బలం
స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (SIPRI) తాజా గణాంకాల ప్రకారం, 2020-2024 మధ్య చైనా ఆయుధాల ఎగుమతుల్లో 63 శాతం పాకిస్తాన్‌దే. ప్రస్తుతానికి పాకిస్తాన్ వైమానిక దళం వద్ద 36 J-10C, 161 JF-17 జెట్స్ ఉన్నాయి. అదనంగా చైనా J-35 స్టెల్త్ జెట్ విక్రయానికి కూడా సిద్ధమని సమాచారం. అంతేకాకుండా యాంటీ-బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఆధునిక రాడార్ టెక్నాలజీపై చర్చలు కొనసాగుతున్నాయి.
Details
భారత్‌కు ఆందోళన?
ఈ పరిణామాలు భారత్‌కు ఆందోళన కలిగించే అంశాలుగా నిపుణులు భావిస్తున్నారు. గత మేలో జరిగిన భారత్-పాక్ ఘర్షణలో, పాకిస్తాన్ చైనా తయారు చేసిన J-10C జెట్స్ వాడినట్లు వార్తలు వెలువడిన విషయం గుర్తుచేశారు. అయితే మరోవైపు, భారత్-చైనా సంబంధాలు కొంతమేర మెరుగుపడుతున్నాయి. గత ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన SCO సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. 'పార్ట్నర్స్, రైవల్స్ కాదని ఇరువురూ స్పష్టం చేశారు. భారత్-చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు, వీసా సడలింపులు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.