కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్
పాకిస్థాన్ పర్వత అధిరోహకుడు ఆసిఫ్ భట్టి ప్రపంచంలోని 9వ అత్యంత ఎత్తైన, ప్రమాదకమైన పర్వతం నంగా పర్బత్‌పై చిక్కుకుపోయారు. 8,126 మీటర్ల నంగా పర్బత్ పర్వతం శిఖరాగ్రానికి వెళ్లడానికి ప్రయత్నించిన ఆయన భారీ మంచు కురవడంతో అక్కడే చిక్కుకుపోయాడని ఆల్పైన్ క్లబ్ ఆఫ్ పాకిస్థాన్ (ఏసీపీ) వెల్లడించింది. ఆసిఫ్ 7,500 మీటర్ల నుంచి 8,000మీటర్ల ఎత్తులో క్యాంప్ 4లో చిక్కుకుపోయాడని, అతనికి సహాయం అవసరమని ఏసీపీ కార్యదర్శి కర్రార్ హైద్రీ తెలిపారు. నంగా పర్బత్ వెళుతున్న వారు అందించిన సమాచారం ప్రకారం, తీవ్రమైన మంచు కారణంగా అతను ముందుకు కదల్లేకపోతున్నారు.
ఆసిఫ్ భట్టి కోసం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని ప్రధాని షెహబాజ్ ఆదేశం
అసిఫ్‌ను రక్షించడానికి హెలికాప్టర్ అవసరమని కర్రార్ హైద్రీ అన్నారు. అతను ఇంకా 6,000మీటర్ల నుంచి 6,500మీటర్ల వరకు కిందకు దిగవలసి ఉందని హైద్రీ వెల్లడించారు. తీవ్రంగా మంచు కారణంగా నంగా పర్బత్‌పై చిక్కుకుపోయిన ఆసిఫ్ భట్టి కోసం తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం అధికారులను ఆదేశించారు. ఆసిఫ్, ప్రఖ్యాత పాకిస్థానీ పర్వతారోహకులు డాక్టర్ జబ్బార్ భట్టి, డాక్టర్ నవీద్, సాద్ ముహమ్మద్, ఫహీమ్ పాషాలతో కలిసి కొన్ని రోజుల క్రితం సాహసయాత్రకు బయలుదేరారు. అయితే అతనితో వెళ్లిన ఇతర సభ్యులు ఇంకా పర్వత శిఖరంపైకి యాత్రను ప్రారంభించలేదుని, ఆసిఫ్ మాత్రమే వెళ్లాడని హైద్రీ చెప్పారు. పర్వతారోహకుడు షెహ్రోజ్ కాషిఫ్ ఆసిఫ్ రెస్క్యూ మిషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
ప్రపంచంలోని ఐదు అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో 'నంగా పర్బత్' ఒకటి
నంగా పర్బత్ పర్వత్వం ప్రపంచంలోని మొదటి ఐదు అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో ఒకటి. ఇప్పటి వరకు 85 మంది పర్వతారోహకులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించి మరణించారు. అందుకే నంగా పర్బత్‌ను "కిల్లర్ మౌంటైన్" గా పిలుస్తారు. ప్రపంచంలోని 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న 14 పర్వతాల్లో ఐదు పాకిస్తాన్‌లో ఉన్నాయి. 1953లో మొదటిసారిగా ఈ శిఖరాన్ని ప్రయత్నించి 30 మందికి పైగా మరణించిన తర్వాత దీన్ని నంగా పర్బత్‌ను "కిల్లర్ మౌంటైన్" పిలవడం ప్రారంభమైంది. గత నెలలో, నార్వే, రష్యా, యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, టర్కీ, మెక్సికో, నేపాల్ మరియు పాకిస్థాన్ నుంచి 23 మంది పర్వతారోహకులు నంగా పర్బత్ శిఖరాన్ని అధిరోహించారు.