
Elon Musk: చైనాతో యుద్ధం.. మస్క్‌కు పెంటగాన్ రహస్యాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలోని డోజ్ (DOGE) విభాగానికి విస్తృత అధికారాలు ఇచ్చిన విషయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో మస్క్ (Elon Musk) త్వరలోనే పెంటగాన్ (Pentagon) సందర్శించనున్నారనే వార్తలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
అంతేకాకుండా, అమెరికా రక్షణ శాఖ రూపొందించిన కొన్ని గోప్యమైన వ్యూహాలను టెస్లా అధినేతకు వివరించనున్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.
ముఖ్యంగా, చైనా (China)తో యుద్ధం జరిగితే అమెరికా ఎలా ప్రతిస్పందించాలనే మిలిటరీ ప్రణాళికను మస్క్‌కు తెలియజేయనున్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెంటగాన్ ను సందర్శించనున్న మస్క్
BREAKING: The New York Times is reporting that Elon Musk will receive a top-secret briefing from the Pentagon on the U.S. Military’s plan for any war that breaks out with China. Musk has multiple business interests in China. This is beyond dangerous. pic.twitter.com/ohcUhlP09x
— Trump’s Lies (Commentary) (@MAGALieTracker) March 21, 2025