Loading...
Iran-USA: పశ్చిమాసియా ఘర్షణల వేళ.. పరిమిత బృందంతో అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు
పశ్చిమాసియా ఘర్షణల వేళ..పరిమిత బృందంతో అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు

Iran-USA: పశ్చిమాసియా ఘర్షణల వేళ.. పరిమిత బృందంతో అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూయార్క్ వెళ్లనున్నారు. అయితే ఆయన వెంట వెళ్లాల్సిన బృందంలో కొంతమంది సభ్యులకు అమెరికా వీసాలు ఇవ్వకపోవడంతో పరిమిత సంఖ్యలో ప్రతినిధులతోనే ఆయన పర్యటన సాగనుంది.

వివరాలు 

యూఎన్‌జీఏ సమావేశాలకు హాజరు

ఈ వారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సమావేశాల ఉన్నతస్థాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇందులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం.. ఐరాస ఆతిథ్య దేశంగా తన బాధ్యతలకు అనుగుణంగా ఇరాన్‌కు చెందిన ప్రధాన ప్రతినిధి బృందం సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది.

ఇందులో అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సహా కీలక అధికారులు ఉన్నారు.

అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇరాన్ ప్రతినిధి బృందం సంఖ్య తక్కువగా ఉండనుంది.

వివరాలు 

కొంతమందికి వీసాలు నిరాకరణ

పెజెష్కియాన్ వెంట వెళ్లే మొత్తం బృందానికి వీసాలు మంజూరు కాలేదు.

ఆయన కమ్యూనికేషన్స్ బృందంలోని కొంతమంది సభ్యులకు అమెరికా వీసాలు నిరాకరించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

దీంతో అధ్యక్షుడి పర్యటన పరిమితస్థాయి ప్రతినిధి బృందంతోనే కొనసాగనుంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ఇరాన్‌పై అమెరికా చర్యలు, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు వంటి అంశాలను పెజెష్కియాన్ ఐరాస వేదికగా ప్రస్తావించనున్నట్లు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్ బృందంపై ఆంక్షలు

అమెరికా ఇరాన్ ప్రతినిధుల పర్యటనకు అనుమతించినప్పటికీ కొన్ని పరిమితులు విధించింది.

వారి న్యూయార్క్‌లో ప్రయాణంపై ఆంక్షలు ఉండనున్నాయి. ఐరాస ప్రధాన కార్యాలయం,

ఇరాన్ ఐరాస మిషన్, రాయబారి నివాసం, జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి నిర్దిష్ట ప్రాంతాలకే వారి కదలికలను పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది.

అలాగే విలాస వస్తువుల కొనుగోలుపైనా పరిమితులు విధించారు.

ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర దౌత్య, సైనిక ఉద్రిక్తతల మధ్య చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT