Page Loader
అట్టహాసంగా బాస్టిల్ డే పరేడ్.. అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మాక్రాన్ 
అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మేక్రాన్‌

అట్టహాసంగా బాస్టిల్ డే పరేడ్.. అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మాక్రాన్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 14, 2023
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం (బాస్టీల్‌ డే) వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్రెంచ్ దేశంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ వేడుకలకు గౌరవఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో కలిసి బాస్టీల్ డే పరేడ్‌ను వీక్షించారు. మరోవైపు యూరోపియన్ దేశాల్లోనే అతిపెద్ద కవాతుగా బాస్టీల్‌ డే పరేడ్‌ పేరు గాంచింది. అయితే ఈ వేడుకల్లో భారత సైనిక బృందాలూ పాల్గొన్నాయి. భారత సాయుధ దళాలకు చెందిన 269 మందితో కూడిన బృందం,ఫ్రెంచ్ దళాలతో కలిసి పరేడ్‌ నిర్వహించాయి. భారత్‌కు చెందిన 4 రఫేల్‌, రెండు సీ-17 గ్లోబ్‌ మాస్టర్లు పారిస్ లో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. అనంతరం మాక్రాన్‌తో మోదీ కీలక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.

EMBED

పారిస్ లో ఘనంగా ఫ్రాన్స్ బాస్టిల్ డే వేడుకలు

https://twitter.com/PTI_News/status/1679771989395791872

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫ్రెంచ్ జాతీయ దినోత్సవంలో పాల్గొన్న భారత ప్రధాని మోదీ